మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో 17 ఫోల్డర్లలో నిగూఢ సమాచారం.. 2500కు పైగా ఫోటోలు, 505 వీడియోలు, 734 ఆడియో రికార్డింగ్స్ పోలీసుల పరిశీలనలో!!
నగ్న వీడియోలు, డ్రగ్స్ పార్టీల కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. మూడురోజుల పాటు పోలీసులు అతడిని విచారించారు. ముఖ్యంగా హార్డ్ డిస్క్‌లో ఉన్న సమాచారంపై దృష్టిపెట్టారు. మొత్తం 17 ఫోల్డర్లు ఉన్న ఈ డిస్క్‌లో ఆరుగురు అమ్మాయిలకు సంబంధించిన వీడియోలను గుర్తించారు. వాట్సాప్ వీడియో కాల్ స్క్రీన్ రికార్డింగ్స్‌తో పాటు మరికొన్ని ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయి. మస్తాన్ సాయి తన భార్య, గర్ల్‌ఫ్రెండ్స్‌కు సంబంధించిన వీడియోలను రికార్డు చేసినట్లు ఒప్పుకున్నాడు.
సైబర్ క్రైమ్ కోణంలో దర్యాప్తు
పోలీసులు హార్డ్ డిస్క్‌ను పూర్తిగా విశ్లేషించగా, 2500కు పైగా ఫోటోలు, 505 వీడియోలు, 734 ఆడియో రికార్డింగ్స్ ఉన్నట్లు తేలింది. వీటిలో ఎక్కువగా లావణ్య అనే యువతితో సంబంధమైన ఫైల్స్ ఉన్నాయి. క్విక్ షేర్ ద్వారా ఫోన్ హ్యాక్ చేసి డేటా తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు, పోడ్‌కాస్ట్ ఫోల్డర్‌లో హ్యాకింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ కూడా లభ్యమైంది. అయితే డ్రగ్స్‌పై మాత్రం మస్తాన్ సాయి పోలీసులకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.





