ఫోన్ ల్లో ఇంటర్నల్ మెమొరీ తక్కవ ఉంటే చాలు. అవసరం నిమిత్తం మైక్రో ఎస్ డీ కార్డులు వాడేస్తాం. అయితే, వాటిలో స్టోర్ చేసిన డేటాని ఎప్పుడైనా ల్యాపీ, పీసీలో కాపీ చేసుకోవాలంటే? కొంచెం కష్టమే!! ఎందుకంటే.. మైక్రో ఎస్ డీ మెమొరీ కార్డుని రీడ్ చేసే స్లాట్స్ ల్యాపీల్లో ఉండవు. అలాంటప్పుడు ఎస్ డీ కార్డుల్ని యాక్సెస్ చేయడం ఎలా? సింపుల్.. ఇదిగోండి ఈ MicroSDHC Memory Card అడాప్టర్ ని ట్రై చేయొచ్చు. ఈ కార్డు రీడర్ లో ఎస్ కార్డుని ఇన్ స్టర్ చేసి వాడుకోవచ్చు. ఒక సెకన్ కి 98ఎంబీ డేటాని కార్డు రీడర్ లో ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. అన్ని రకాల ల్యాపీల్లో కార్డు సపోర్ట్ చేస్తుంది. కార్డు రీడర్ తో పాటు 32జీబీ కెపాసిటీ ఉన్న మైక్రో ఎస్ కార్డుని కూడా పొందొచ్చు. ఇంకేముందీ.. కార్డుని అడాప్టర్ లో పెట్టుకుని డీఎస్ ఎల్ ఆర్ కెమెరాలోనూ వాడుకోవచ్చు. మైక్రో ఎస్ డీ కార్డుకి అన్ని రకాల ‘సెక్యూరిటీ కవచాలు’ ఉన్నాయి. వాన, దుమ్ము, వేడి.. ఏది మైక్రో ఎస్ డీ కార్డుని డ్యామేజ్ చేయలేవు. ధర: రూ.369
దొరుకు చోట: https://bit.ly/DailyDiscoverTech





