
తన కుటుంబ వ్యవహారంలో జరిగిన సంఘటనపై నటుడు మోహన్ బాటు మరోసారి స్పదించారు. గాయపడిన జర్నలిస్ట్ కి సారీ చెబుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ షేర్ చేశారు. “ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనను అధికారికంగా ప్రస్తావించడంపై విచారం వ్యక్తంచేస్తున్నాను. కుటుంబ వివాదం కారణంగా కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో ఓ జర్నలిస్ట్ సోదరుడు గాయపడడం విచారకరం. అది నాకెంతో బాధ కలిగించింది. ఆ ఘటన తర్వాత దాదాపు 48 గంటలు ఆసుపత్రిలో చేరడం వల్ల స్పందించలేకపోయాను. అప్పుడున్న పరిస్థితుల్లో కాస్త గందరగోళం ఏర్పడింది. మీడియా ప్రతినిధులు అనుకోకుండా వచ్చారు. నేను పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో ఒక జర్నలిస్ట్‌కు గాయమైంది. ఇది చాలా దురదృష్టకరం. అతడికి, అతడి కుటుంబానికి కలిగిన బాధకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. హృదయపూర్వకంగా క్షమించమని కోరుతున్నా. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అని మోహన బాబు లేఖలో రాసుకొచ్చారు





