‘పవన్ గెలుపు ముందు నుంచే ఖాయం.. ఎవరైనా కారణమని అనుకుంటే అది వారి ఖర్మ అని నాగబాబు చేసిన వాఖ్యలు.. టీడీపీ, జనసేన వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయా?
జనసేన నేత, కాబోయే ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు చేసిన తాజా వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేపుతున్నాయా?. ‘పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ముందే పవన్ గెలుపు ఖరారు చేసుకున్నారు. ఎవరో ప్రత్యేకంగా విజయం కోసం కృషి చేశానని అనుకోవడం వారి ఖర్మ’ అంటూ నాగబాబు చెప్పిన మాటలు టీడీపీ నేత ఎస్వీఎస్‌ఎన్ వర్మ అనుచరులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. వర్మకు ఎమ్మెల్సీ టికెట్ దక్కలేదు, కానీ పార్టీ కోసం పనిచేస్తానని ప్రకటించినప్పటికీ, నాగబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో ఆగ్రహానికి దారి తీశాయి. ‘ఎన్నికల ముందు ఓట్లు వేయించుకుని గెలిచాక నాలుక మడతపెట్టడం తగదు’ అంటూ సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. దీనితో జనసేన-టీడీపీ మధ్య చిన్న ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.





