- ‘‘కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చిన సినిమా ఇది’’ అని నాగ్ కామెంట్స్
- ‘‘మాయాబజార్‌లో ఎవరు హీరోలన్నట్టు… ఈ సినిమాలో హీరో శేఖరే’’
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా గురించి మాట్లాడుతూ, నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ధనుష్‌తో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. ఆయన ఇంకా బిగ్ విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా. కానీ ఇది మా సినిమా కాదు – ఇది కచ్చితంగా శేఖర్ కమ్ముల సినిమా. మేమంతా ఇందులో పాత్రధారులం మాత్రమే. ఆయన తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి తీసిన ఈ ప్రయత్నం నిజంగా గొప్పది’’ అన్నారు.
‘‘ఇలాంటి టీమ్ వర్క్ చాలా రోజుల తర్వాత చూశా’’
‘‘మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీ రంగారావు ఎవరు హీరో? ఎవ్వరూ కాదు… దర్శకుడు కేవీ రెడ్డే హీరో. అలా ఈ సినిమాలో హీరో శేఖరే. ఈ సినిమాతో నాకు టీమ్ వర్క్ గుర్తొచ్చింది. మళ్లీ సినిమాటిక్ ఎనర్జీ అనిపించింది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ కూడా పెద్ద ప్లస్. దేవిశ్రీ ప్రసాద్ చేసిన సంగీతం సినిమాలో చాలా బలంగా నిలుస్తుంది’’ అని చెప్పారు. మరోవైపు తన క్లాసిక్ మూవీ ‘శివ’ మళ్లీ రీ-రిలీజ్ కాబోతుందని కూడా అభిమానులకు తెలిపారు.





