
ఏదో ఒకటి చేద్దాం..
దేశాన్ని ఉద్దరించక్కర్లేదు…
వీధుల్లోనే చెత్తని శుభ్రం చేయక్కర్లేదు..
ఇంట్లో చెత్తని గోడ పక్కనో.. పక్కింట్లోకో వేయకండి చాలు..
ఏదో ఒకటి చేద్దాం..
కోట్లు సాయం చేయక్కర్లేదు..
పిలిచి భోజనం పెట్టక్కర్లేదు..
ప్లేటులో పెట్టుకున్న దాన్ని పారేయకండి చాలు..
ఏదో ఒకటి చేద్దాం..
ఉన్నత లక్ష్యాల్ని పెట్టుకోవక్కర్లేదు…
కలెక్టర్ కావాలని కలలు కనక్కర్లేదు…
కన్నవాళ్లని కంటికి రెప్పలా చూసుకోండి చాలు…
ఏదో ఒకటి చేద్దాం..
మహానుభావులు అయిపోనక్కర్లేదు..
మంచోళ్లని పిలిపించుకోనక్కర్లేదు..
మనిషిగా బతకాలనుకోండి చాలు..






