‘స్వయంభూ’ సీక్రెట్ షూటింగ్.. నిఖిల్ ఆసక్తికర అప్‌డేట్!

  • 95% షూటింగ్ పూర్తైంది: భారీ బడ్జెట్‌తో రహస్యంగా చిత్రీకరణ
  • ‘కార్తికేయ 3’ త్వరలో ప్రారంభం: ‘ది ఇండియా హౌస్’ తర్వాత షూటింగ్

నిఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘స్వయంభూ’ షూటింగ్ చివరి దశలోకి వచ్చింది. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సోషియో-ఫాంటసీ నేపథ్యంతో గ్రాండ్ విజువల్ ట్రీగా రాబోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిఖిల్, ‘‘ఈ సినిమా కోసం ఏడాదిుగా కఠినంగా శిక్షణ తీసుకున్నాను. ఇది నా కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ సినిమా. 95% షూటింగ్ పూర్తయింది. ‘కార్తికేయ 3’ కోసం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. చందూ మొండేటి స్క్రిప్ట్ సిద్ధం చేసేలోపు ‘ది ఇండియా హౌస్’ షూటింగ్ పూర్తి చేస్తాను’’ అని వెల్లడించారు.

నిఖిల్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్

పోరాటయోధుడిగా కనిపించనున్న నిఖిల్, ఈ పాత్ర కోసం 8 నెలల పాటు కఠినమైన డైట్ ఫాలో అయ్యారు. మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ప్రత్యేకంగా ‘RRR’ సినిమాకు పని చేసిన స్టంట్ మాస్టర్ కింగ్ సోలోమాన్ వద్ద 45 రోజుల శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మేనన్ కథానాయికగా నటిస్తున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.