భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) తన మొదటి టెస్టు శతకాన్ని చాలా క్లిష్ట పరిస్థితుల్లో పూర్తి చేశాడు. సుందర్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నీతీశ్, చివరి వికెట్‌గా మిగిలిన మహ్మద్ సిరాజ్ తో కలిసి టెస్టు కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు.
టెన్షన్ వాతావరణం..
నితీశ్ 99 పరుగుల వద్ద ఉండగా, ప్యాట్రిక్ కమిన్స్, స్కాట్ బోలాండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటం అభిమానుల్లో ఆందోళన. చివరి వికెట్‌గా ఉన్న సిరాజ్ డిఫెన్సివ్ షాట్లతో విలువైన సమయం గడిపి, నితీశ్‌కు స్ట్రైకింగ్ ఇవ్వడం.. ఒత్తిడిని అధిగమించిన నితీశ్, బోలాండ్ బౌలింగ్‌లో ఒక అద్భుత బౌండరీతో 171 బంతుల్లో తన శతకం పూర్తి చేశాడు. నితీశ్ సెంచరీని సాక్షాత్తు తండ్రి ముత్యాలరెడ్డి స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించారు. శతకం అనంతరం స్టేడియం మొత్తం అభిమానుల అరుపులతో మార్మోగింది. నితీశ్ తండ్రి ఎంతో ఉద్వేగంతో నితీశ్ ని చూస్తూ మురిసిపోయాడు.
ఇన్నింగ్స్ కీలకత
ఈ ఇన్నింగ్స్ భారత జట్టుకు ఎంతో ముఖ్యమైంది. ఫాలో ఆన్ గండం నుంచి రక్షించి, ఆసీస్ స్కోరును సమీపం చేసే దిశగా జట్టును ముందుకు నడిపించాడు. చివరి వికెట్ భాగస్వామ్యంగా 42 పరుగులు జోడించి, జట్టును గౌరవప్రదమైన స్థితికి చేర్చాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి శతకం చేసిన భారత బ్యాటర్లలో నితీశ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. అతని గట్టి పట్టుదల, మ్యాచ్ ఫినిషింగ్ నైపుణ్యం అతని భవిష్యత్ క్రికెట్ ప్రయాణానికి పునాది వేసాయి.





