సోషల్ మీడియాలో హీరోయిన్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అభిమానులు వారి ఫోటోలను తెగ షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం ఓ చిన్నదాని ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో క్యూట్‌గా కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తున్న టాలీవుడ్ బ్యూటీ నివేదా థామస్. నివేదా థామస్ మలయాళంలో బాలనటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తర్వాత టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెంటిల్‌మన్ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2024లో విడుదలైన 35 చిన్న కథ కాదు చిత్రంతో మరోసారి తన ప్రతిభను చాటుకుంది.





