త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ సరికొత్త సినిమా.. ‘దేవ సేనాని’గా నెక్స్ట్ లెవెల్ మైథలాజికల్ హంగామా!”కార్తికేయుడి కాన్సెప్ట్‌తో ఎన్టీఆర్-త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్.. అనిరుధ్ మ్యూజిక్‌తో పాన్-ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఎపిక్ మూవీ.”
జూనియర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న సరికొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. పురాణాల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతున్న ఈ భారీ చిత్రంలో ఎన్టీఆర్ ‘కార్తికేయుడి’ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. (NTR Jr Trivikram movie poster) “శివుడి కుమారుడు.. పార్వతిదేవికి గర్వకారణం.. దేవ సేనాని.. మరోసారి త్రివిక్రమ్‌తో” అంటూ ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతోపాటు నిర్మాత నాగవంశీ ఈ సినిమాకు సంబంధించిన ఒక పవర్‌ఫుల్ ప్రమోషనల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ప్రాచీన దేవాలయాలు, యుద్ధభూమి నడుమ.. ఒక భయంకరమైన త్రిశూలం డీఎన్ఏ (DNA) హెలిక్స్‌తో కలిసి ఉన్న విజువల్స్ ఈ పోస్టర్‌లో హైలైట్‌గా నిలిచాయి. అలాగే ఈ కథ ఉత్తరాదిన పుట్టి, మధ్య భారతంలో రూపుదిద్దుకుని, దక్షిణాదిన పూజలందుకునే ఒక యూనివర్సల్ ఎపిక్ స్టోరీ అని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, హారిక అండ్ హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరోవైపు సంస్కృత శ్లోకాలు, “వన్ స్పియర్.. వన్ పర్పస్.. వన్ డివైన్ రెకనింగ్” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.





