- సమాజ సేవను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజికల్ నైట్
- రక్తదానంతో ప్రాణాలు కాపాడొచ్చని భువనేశ్వరి సందేశం.. ఎన్టీఆర్ ఆత్మస్ఫూర్తితో సేవా కార్యక్రమాలు

“సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు” అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించనున్నట్లు నారా భువనేశ్వరి ప్రకటించారు. రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జీవితాలను రక్షిస్తాయని, అందరూ దీనిలో భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
తమన్ మ్యూజికల్ నైట్
యుఫోరియా కార్యక్రమంలో భాగంగా ఫండ్ రైజింగ్ కోసం సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారని భువనేశ్వరి తెలిపారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు అందరూ చేయాలని, మనం చేసిన మంచి పనులే మనతో ఉంటాయని ఆమె పేర్కొన్నారు.





