వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్లు వన్‌ప్లస్ 13 మరియు వన్‌ప్లస్ 13R జనవరి 7, 2025న విడుదల కాబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించింది. వీటిలో వన్‌ప్లస్ 13Rను “పాకెట్ పవర్‌హౌస్”గా అభివర్ణించినా, ఫీచర్ల గురించి మాత్రం పెద్దగా వివరాలు వెల్లడించలేదు. అయితే, అమెజాన్ ఇండియా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌ను అనుకోకుండా లీక్ చేసింది.
ప్రాసెసర్ డిటైల్ లీక్!
అమెజాన్‌లో వన్‌ప్లస్ 13 సిరీస్ కోసం ఏర్పాటు చేసిన ల్యాండింగ్ పేజీలో వన్‌ప్లస్ 13Rలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుందని తెలియజేశారు. ఇక వన్‌ప్లస్ 13లో అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారు.
ప్రత్యర్థులకు సవాల్
వన్‌ప్లస్ 13Rకు ఈ ప్రాసెసర్‌ను అందించడాన్ని ఆశ్చర్యంగా చూడాల్సిన పనిలేదు. ఎందుకంటే, గతేడాది విడుదలైన వన్‌ప్లస్ 12Rలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను వాడిన సంగతి తెలిసిందే.
ఇతర కీలక ఫీచర్లు
అమెజాన్ పేజీలో బ్యాటరీ సామర్థ్యంతో పాటు వన్‌ప్లస్ 13Rలో ఏఐ ఆధారిత ఫీచర్లు కూడా ఉండబోతున్నాయని హింట్ ఇచ్చారు. ఈ ఏఐ టూల్స్ ద్వారా ఫొటోలు ఎడిట్ చేయడం, ప్రొడక్టివిటీని పెంచడం వంటి పనులు సులభమవుతాయి.
ఇలాంటి స్పెసిఫికేషన్లతో, వన్‌ప్లస్ 13R నిజంగానే “పాకెట్ పవర్‌హౌస్”గా నిలుస్తుందని అంచనా. జనవరి 7న అధికారిక లాంచ్‌కు ఈ ఫోన్ల మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.






