- వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్ జూలై 8న లాంచ్
- ఫోన్‌లో వెనుక 50 మెగాపిక్సెల్, ముందు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని వన్‌ప్లస్ సంస్థ ప్రకటన
వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఒక కొత్త అప్‌డేట్ వచ్చేసింది. ఫొటోగ్రఫీ లవర్స్ కి కచ్చితంగా ఇది గుడ న్యూసే. అదేంటంటే.. ఫోన్‌లో వెనుక 50 మెగాపిక్సెల్ ఉంటే.. వెనక సెల్ఫీ కెమెరా కూడా 50 ఎంపీ కెమెరానే. ఈ న్యూస్ ని వన్‌ప్లస్ మంగళవారం స్పష్టం చేసింది. చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ చెప్పిన దాని ప్రకారం.. నార్డ్ 5 వెనుక కెమెరా సోనీ లైట్-700 సెన్సార్తో వస్తుంది. ముందు కెమెరాకు జేఎన్5 సెన్సార్ను వాడుతున్నారు. 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అదనంగా, ఈ ఫోన్‌లో 8 ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంది. ఇది 116° వ్యూతో విశాలమైన ఫోటోలను తీయడానికి పనికొస్తుంది. దీంతో పాటు లైవ్‌ఫోటో ఫంక్షనాలిటీ ఉంది. షట్టర్ నొక్కిన 1.5 సెకన్లు ముందు, 1.5 సెకన్లు తర్వాత జరిగిన కదలికలను ఇది 3 సెకన్ల మోషన్ షాట్‌లుగా క్యాప్చర్ చేస్తుందని వన్‌ప్లస్ తెలిపింది. ఇక ప్రాసెసింగ్ విషయానికి వస్తే స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ వాడారు.
ఈ ఫోన్‌తో పాటు లాంచ్ కానున్న వన్‌ప్లస్ బడ్స్ 4 కూడా కొన్ని కొత్త ఫీచర్లతో వస్తున్నాయి. వీటిలో 55డీబీ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్‌సీ) ఉంటుంది. ఇది 5500 Hz ఫ్రీక్వెన్సీ రేంజ్‌లో పనిచేస్తుంది. కొత్త అడాప్టివ్ మోడ్ కూడా ఈ బడ్స్‌లో ఉంది. ఇది చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి నాయిస్ క్యాన్సిలేషన్, బయటి శబ్దాలను వినగలిగే స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 5 జూలై 8న లాంచ్ అవుతుంది. దీనితో పాటు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 మరియు వన్‌ప్లస్ బడ్స్ 4 కూడా మార్కెట్లోకి వస్తాయి.






