- ల్యాప్‌టాప్, ఫోన్ దాచిపెట్టిందని తల్లిపై దాడి
- విశాఖలో జరిగిన ఘటన కలకలం
ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన ఓ యువకుడు (Online Gaming Addiction) కన్నతల్లినే హత్య చేసిన ఘటన విశాఖలో తీవ్ర కలకలం రేపింది. తీరగస్తీ దళంలో విధులు నిర్వహిస్తున్న బల్బీర్ సింగ్ కుటుంబం విశాఖ కోస్టుగార్డు క్వార్టర్స్‌లో ఉంటోంది. అతని పెద్ద కుమారుడు అన్‌మోల్‌సింగ్ (20), బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి. గురువారం సాయంత్రం తల్లి అల్కాసింగ్ (47) – గేమింగ్ విషయంలో వాగ్వాదం జరగగా, కోపంతో కత్తితో దాడి చేసి హత్య చేశాడు. తల్లిని హత్య చేసిన అన్‌మోల్‌సింగ్, మృతదేహాన్ని పడకగదిలో పెట్టి తాళం వేసి బయటకు వచ్చాడు. ఇంటికి వచ్చిన తమ్ముడు ఆయుష్మాన్‌సింగ్ (18) అనుమానం తో ప్రశ్నించగా, విషయాన్ని గ్రహించిన ఇరుగుపొరుగు గదిని తెరచి చూసి అల్కాసింగ్ మృతదేహాన్ని గుర్తించారు. రాత్రికి రాత్రే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులు అన్‌మోల్‌సింగ్ మానసిక స్థితి సరిగాలేదని తెలిపారు.






