కలెక్టర్ల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు!! డిప్యూటీ సీఎమ్ డీప్ గా వెళ్తున్నారు!!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎన్నికలకు ముందు ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసి, పాలనపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా, ఆయన గత వైసిపి ప్రభుత్వంలో ఉన్నతాధికారులు ఎలా వ్యవహరించారో విమర్శించారు.

“గతంలో పర్యావరణాన్ని కాపాడేవారిని హీరోలుగా చూపించేవారు, ఇప్పుడు చెట్లను నరికేవారిని హీరోలుగా చూపిస్తున్నారు” అని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా అల్లు అర్జున్ “పుష్ప” సినిమాను ఉద్దేశించినట్లు భావిస్తున్నారు.ఇటీవల, పవన్ కళ్యాణ్ కడప మున్సిపల్ హైస్కూల్లో జరిగిన పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో విద్యార్థులకు నిజమైన హీరోలను గుర్తించమని సూచించారు. “సినిమాల్లో నటించే వారిని కాకుండా, విద్యాబుద్దులు నేర్చించే ఉపాధ్యాయుల్లో హీరోలను చూడండి” అని ఆయన చెప్పారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *