- భారత్ ప్రతి ప్రయత్నం గౌరవపూర్వకమే, కానీ ప్రతిసారి ద్రోహమే ఎదురైంది
- లెక్స్ ఫ్రిడ్‌మన్ పాడ్‌కాస్ట్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌తో శాంతి చర్చలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో నవాజ్ షరీఫ్‌ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన సంఘటనను గుర్తు చేస్తూ, శాంతి దిశగా భారత్ ఎప్పుడూ ముందడుగు వేసిందని, కానీ పాకిస్తాన్ ప్రతిసారి ద్రోహం, విద్వేషంతోనే స్పందించిందని చెప్పారు. “కనీసం ఇప్పటికైనా పాక్ శాంతి మార్గాన్ని ఎంచుకుంటుందా?” అని ప్రశ్నించారు. పాడ్‌కాస్ట్‌లో మోదీ విమర్శలను స్వీకరించే తీరును స్పష్టంగా వ్యక్తపరిచారు. “విమర్శలు ప్రజాస్వామ్యానికి ఆత్మ. అవి పదునుగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది” అని అన్నారు. అంతే కాకుండా చైనా, అమెరికా, ఆర్‌ఎస్‌ఎస్, పేదరికం, గోద్రా ఘటనపై కూడా స్పందించారు.
చైనా-భారత్ సంబంధాలు, ట్రంప్‌పై మోదీ వ్యాఖ్యలు
- భారత్-చైనా: పోటీ ఆరోగ్యకరంగా ఉండాలని, అది సంఘర్షణకు దారి తీయకూడదని స్పష్టం
- ఇండియా-ఫస్ట్: ట్రంప్ మాదిరిగానే తానూ భారత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తానని మోదీ పేర్కొన్నారు.
- ఆర్‌ఎస్‌ఎస్ గురించి మాట్లాడిన మోదీ, “ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ. ఇది దేశ సేవకే అంకితమైనది” అని చెప్పారు.





