“భక్తుల నడుమ రీల్స్ చేస్తున్న యువతిని స్పాట్‌లోనే నిలదీసిన యూనిఫామ్ ఆఫీసర్.. టెంపుల్స్ లో ఫోన్లు బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో భారీ డిమాండ్.”
భక్తిభావంతో ఉండే గుడి ప్రాంగణంలో రీల్స్ పిచ్చితో డాన్స్ చేస్తున్న అమ్మాయికి పోలీస్ ఆఫీసర్ గట్టి క్లాస్ పీకాడు. ఉత్తర భారత దేశానికి చెందిన ఒక ప్రముఖ హిందూ దేవాలయంలో సాంప్రదాయ దుస్తులు ధరించిన భక్తుల నడుమ.. అమ్మాయి డాన్స్ రీల్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో అక్కడే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. (Temple dance reel viral video policeman reaction) ఆమె దగ్గరకు వెళ్లి డాన్సులు చేయవద్దంటూ సీరియస్‌గా సైగలు చేస్తూ అక్కడి నుండి పంపించేశాడు. ఈ 17 సెకన్ల చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.
పేరెంట్స్ తప్పు పడుతున్న జనాలు.. కెమెరాలపై బ్యాన్ డిమాండ్
ఈ ప్రమాదకరమైన రీల్స్ ట్రెండ్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పిల్లలను పద్ధతిగా పెంచడంలో తల్లిదండ్రులు విఫలమవుతున్నారంటూ చాలా మంది విమర్శిస్తున్నారు. అలాగే గుడి పవిత్రతను కాపాడటం కోసం దేవాలయాల లోపలికి ఫోన్లు, కెమెరాలను కంప్లీట్‌గా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆ అమ్మాయిని అడ్డుకున్న పోలీస్ ఆఫీసర్ సమయస్ఫూర్తిని, అతని రెస్పాన్స్‌ను నెటిజన్లు పక్కాగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వైరల్ వీడియో క్లిప్ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా క్రేజ్ ఏ స్థాయికి చేరిందో చూపించడానికి ఒక పక్కా ఉదాహరణగా నిలిచింది.
17-second viral video shows policeman stopping girl filming dance reel in North Indian temple. Public divided on temple etiquette, phone bans, and cultural respect.





