- మెక్సికోలో లొకేషన్ల పరిశీలనలో సందీప్ రెడ్డి వంగా
- తొలిసారి పోలీస్ అధికారిగా ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) – సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ (Spirit) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా యూఎస్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన సందీప్ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘‘షూటింగ్ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నాం.. అక్కడే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు.
ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్‌లో బిజీ
ఇప్పటికే సంగీత సన్నాహాలు ప్రారంభమయ్యాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రభాస్ తొలిసారి పోలీస్ అధికారిగా నటించనున్న ఈ సినిమా, అందరి అంచనాలను మించిపోతుందని సందీప్ అన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’ షూటింగ్‌లో బిజీగా ఉండగా, ‘కన్నప్ప’, ‘సలార్ 2’, ‘కల్కి 2’ ప్రాజెక్ట్స్‌కు సైతం సన్నాహాలు చేస్తున్నారు.





