- ఇప్పటివరకు మౌనంగా ఉన్న ‘ది రాజా సాబ్’ టీమ్… టీజర్‌తో వైబ్!
- కామెడీ, హారర్, విజువల్స్..అన్ని మిక్స్ అయ్యి ఫ్యాన్స్‌కు పండుగ
అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు చివరికి రాజా సాబ్ టీమ్ బంపర్ గిఫ్ట్ ఇచ్చింది. ‘ది రాజా సాబ్’ టీజర్ సోమవారం విడుదలయ్యింది. విడుదలైన క్షణాల్లోనే టాప్ ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. 148 సెకన్ల నిడివి గల ఈ టీజర్లో కామెడీ, హారర్, రొమాన్స్, యాక్షన్ అన్నీ సమపాళ్లలో పంచినట్టే ఉంది. ప్రభాస్ వింటేజ్ లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ముగ్గురు హీరోయిన్ల గ్లామర్, సన్నివేశాలు, సంజయ్ దత్ లుక్స్, రాజమహల్ నేపథ్యం అన్నీ సినిమాకి క్రేజీ లెవెల్ పెంచేశాయి. టీజర్ చివర్లో డార్లింగ్ చెప్పే “తాత వైర్ కొరికేశాడేమో చూడండ్రా బయట” అనే డైలాగ్ నెట్టింట్లో హైలైట్ అవుతోంది.
మారుతి మేనరిజం .. తమన్ మ్యూజిక్
ఈ టీజర్‌తో డైరెక్టర్ మారుతిపై డార్లింగ్ ఫ్యాన్స్ అభిమానం రెట్టింపు అయ్యింది. ఆయన ప్రభాస్‌ని ఎలా చూపించాలనుకున్నారో, ఫ్యాన్స్ ఊహించిన దానికంటే బాగా చూపించారు అనే టాక్ స్పష్టంగా వినిపిస్తోంది. కెమెరా వర్క్, విజువల్ గ్రాండియర్ పీపుల్స్ మీడియా ప్రొడక్షన్ విలువలు అన్నీ టీజర్ నుంచే చూపిస్తున్నాయి. ముఖ్యంగా తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం టాప్ క్లాస్‌లో ఉంది. పేరు టీజర్ అయినా ఇది ఒక చిన్న ట్రైలర్ లా అనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ‘రాజా సాబ్’ టీజర్ గురించి మాట్లాడుతోంది. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా డార్లింగ్ ఫ్యాన్స్‌కు మాస్ జాతరే!!





