- ప్రణయ్ హత్యపై కోర్టు తీర్పు వినిపించిన తండ్రి ఆవేదన
- ‘‘ఒక్క హత్యతో ఎంతో మంది జీవితాల్లో చీకట్లు’’ – బాలస్వామి
ప్రేమ వివాహం చేసుకున్న తన కుమారుడు ప్రణయ్‌ను సొంత మామే హత్య చేయించడాన్ని ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి మరోసారి తీవ్రంగా ఖండించారు. కోర్టు తీర్పును కుల దురహంకారానికి చెంపపెట్టు గా భావిస్తున్నట్లు తెలిపారు. సోమవారం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత మిర్యాలగూడలో ప్రణయ్ కుటుంబ సభ్యులు ఎమోషనల్ అయ్యారు. అనంతరం ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లి తల్లిదండ్రులు బాలస్వామి, ప్రేమలత, సోదరుడు పూలమాల వేసి కన్నీరు పెట్టుకున్నారు. మీడియాతో మాట్లాడిన బాలస్వామి, ‘‘చర్చలతో పరిష్కరించాల్సిన విషయంలో హత్య చేయించారు. ఒక్క హత్యతో ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి. నిందితుల భవిష్యత్తు నాశనమైంది. అమృత భర్తను, చిన్నారి తండ్రిని కోల్పోయింది. ఇది జీవితాంతం మిగిలిపోయే విషాదం’’ అని అన్నారు. అప్పటి ఎస్పీ రంగనాథ్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా విచారణ చేసి నిందితులకు శిక్షలు ఖరారు చేయించారని గుర్తు చేశారు.





