- పిల్లలను కేవలం అవును, కాదు అని సమాధానం చెప్పే ప్రశ్నలు కాకుండా ‘ఎందుకు, ఎలా’ అని ఆలోచింపజేసే ప్రశ్నలు అడగాలి
- ‘ఏమిటి, ఎలా, ఎందుకు’ వంటి ప్రశ్నలు (WH-questions) అడగడం వల్ల పిల్లల్లో భాషా నైపుణ్యం, ఆలోచనా శక్తి పెరుగుతాయని పరిశోధనల వెల్లడి
- అమెరికాకు చెందిన ప్రముఖ థెరపిస్ట్ అమీ మోరిన్ సూచనల ప్రకారం.. పిల్లల్లో ఎమోషనల్ అవేర్‌నెస్ పెంచడానికి అర్థవంతమైన సంభాషణలే కీలకం
పిల్లలతో మాట్లాడటం అంటే కొన్నిసార్లు మనకు తెలియని భాషలో మాట్లాడటంలా అనిపిస్తుంది. మనం ఏదైనా అడిగితే ‘బాగుంది’, ‘అయిపోయింది’ వంటి ఒక్క మాటతోనే వారు సరిపెట్టేస్తుంటారు. కానీ వారి మనసులోని అసలు ఆలోచనలు బయటకు రావాలంటే, మనం అడిగే ప్రశ్నల్లో మార్పు రావాలి. గ్రేడ్లు, హోంవర్క్ ల గురించి మాత్రమే కాకుండా.. వారి అంతరంగంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తిని మనం ప్రదర్శించాలి.(Right Questions to Ask Your Child to Encourage Communication)

“సరైన ప్రశ్నలు వేయడం అంటే పిల్లల షెడ్యూల్ గురించి తెలుసుకోవడం కాదు.. వారి ప్రపంచంలోకి మనం ఒక అడుగు వేయడం”
ప్రశ్నల్లోనే ఉంది అసలు కిటుకు!
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం, చిన్నతనం నుంచే పిల్లలను ఆలోచింపజేసే ప్రశ్నలు అడగడం వల్ల వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా పెరుగుతాయి. ఉదాహరణకు, “ఈరోజు నిన్ను నవ్వించిన విషయం ఏంటి?”, “ఈరోజు నీకు ఎదురైన కష్టమైన పని ఏది?”, “ఈరోజు నీ జీవితం ఒక సినిమా అయితే దానికి ఏం పేరు పెడతావు?” వంటి ప్రశ్నలు అడగాలి. ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు పిల్లలు కాసేపు ఆగి ఆలోచిస్తారు. తమ మెదడులోని ఆలోచనలను మాటల రూపంలోకి తెస్తారు. మొదట్లో వారు సమాధానం చెప్పడానికి సందేహించినా, ఓపికగా వేచి ఉంటే మెల్లగా మనసు విప్పి మాట్లాడటం మొదలుపెడతారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య నమ్మకాన్ని, బంధాన్ని మరింత బలపరుస్తుంది.
మీ పిల్లలతో కబుర్లు చెప్పేటప్పుడు మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు? వారు మీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలేంటి? కామెంట్ చేయండి.





