భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాలన సామాన్యుల జీవన విధానాన్ని మార్చేసిన కీలక నిర్ణయాలకు వేదికైంది. సమాచార హక్కు చట్టాన్ని తెచ్చి సామాన్యుడికి ప్రభుత్వంపై ప్రశ్నించే శక్తిని ఇచ్చారు. 3జీ, 4జీ టెలికాం సేవల ప్రారంభంతో దేశం మొబైల్ సాంకేతిక విప్లవాన్ని సాక్షాత్కరించింది. ఆధార్ కార్డుల రూపకల్పనతో ప్రతి భారతీయుడికి గుర్తింపు కార్డు కల్పించారు.
గ్రామీణ పేదలకూ ఆర్థిక భరోసా
యూపీఏ హయాంలో ఉపాధి హామీ పథకం అమలు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకూ ఆర్థిక భరోసాను అందించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) విధానం ప్రారంభించి పథకాల కింద లభించే నగదు సాయాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయడం ప్రారంభించారు. ఇదే విధానం ప్రభుత్వ పనితీరును పారదర్శకంగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది. ఆయన నాయకత్వంలో వచ్చిన ఈ నిర్ణయాలు సామాన్య భారతీయుడి జీవితంలో ఒరవడిని మార్చేశాయి.





