భారత క్రికెట్ అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. భారత సారథి రోహిత్ శర్మ సిడ్నీ టెస్టులో ఎందుకు ఆడలేదనే ప్రశ్నకు సమాధానం దొరికింది. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అనే ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఆసీస్‌తో జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు లంచ్ బ్రేక్ సమయంలో ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి రోహిత్ మాట్లాడి తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చాడు.
“రిటైర్మెంట్‌కి కాదు, జట్టు అవసరాలకే విశ్రాంతి”
రోహిత్ మాట్లాడుతూ, ‘‘నేను టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం లేదు. సిడ్నీ టెస్టులో విశ్రాంతి తీసుకున్నానంతే. జట్టు ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ పెర్త్ టెస్టులో అద్భుతంగా ఆడారు. వారిని మరో అవకాశం ఇవ్వాలనుకుంది జట్టు స్ట్రాటజీ. ప్రస్తుతం నేను ఫామ్‌లో లేనప్పటికీ, రాబోయే రోజుల్లో నేను పరుగులు చేయబోతున్నా. ఎవరికీ నా భవిష్యత్తును నిర్ణయించే హక్కు లేదు,’’ అని స్పష్టం చేశాడు.
స్లెడ్జింగ్‌పై స్పందన
బుమ్రా-కొన్‌స్టాస్ మధ్య మైదానంలో జరిగిన వాగ్వాదంపై కూడా స్పందించిన రోహిత్, ‘‘మా జట్టులో యువ ఆటగాళ్లు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటారు. కానీ ఎవరైనా రెచ్చగొడితే రియాక్ట్ అవుతారు. ఇది సహజం. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి విబేధాలు లేవు. అలాంటి వార్తలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు,’’ అని తెలిపాడు.






