సైఫ్ అలీఖాన్‌కు ఆటోడ్రైవర్ సాయం: కలిసి కృతజ్ఞతలు తెలిపిన సైఫ్!!

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన అందరినీ కలవరపరిచిన విషయం తెలిసిందే. బాంద్రాలోని ఆయన నివాసంలో దుండగుడు చొరబడి సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. పెనుగులాటలో సైఫ్ ఆరుచోట్ల తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సమయంలో, భజన్ సింగ్ రాణా అనే ఆటోడ్రైవర్ సైఫ్‌ను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాపాయం నుంచి రక్షించాడు. ఆస్పత్రిలో చేరిన సైఫ్‌ ఇప్పుడు కోలుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుండగా, భజన్ సింగ్‌ను ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

భజన్ సింగ్ ఏం చెప్పాడంటే..

“ఆ రాత్రి నాకు సైఫ్ ఎవరో కూడా తెలియదు. ఒక మహిళ సాయం కోసం అర్థించింది. వెంటనే ఆటో ఆపి, సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లాను. 10 నిమిషాల్లో ఆస్పత్రి చేరాం. రూపాయి కూడా తీసుకోలేదు,” అని భజన్ సింగ్ చెప్పాడు. ఈ ఉదంతం నెటిజన్లను ఆకట్టుకుంది. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ కూడా డ్రైవర్ సేవలను మెచ్చుకున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *