- కోడ్ రాసేది AI అయితేనేం… ఆలోచించేది మనమే కావాలి అంటున్నారు
- లాజిక్, డిజైన్, థింకింగ్ స్కిల్స్ నేర్చుకోండి అంటూ టెక్కీలకు క్లియర్ సలహా
AI రోజురోజుకీ టెక్ ఇండస్ట్రీని మార్చేస్తున్న ఈ యుగంలో, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. “బేసిక్స్ పక్కా ఉంటేనే ఈ రంగంలో నిలబడగలం” అని, సాఫ్ట్‌వేర్ రంగంలోకి అడుగుపెడుతున్న యువతకు సలహా చెప్పారు. ప్రముఖ టెక్ యూట్యూబర్ సజ్జాద్ ఖాదేతో చేసిన చిట్‌చాట్‌లో నాదెళ్ల ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అతని మాటల్లో, “AI నీకు సహాయం చేస్తుంది, కానీ దానికి దారి చూపేది నీ ఆలోచన శక్తి, నీ లాజిక్.” ప్రాబ్లెమ్‌ను ఎలా బ్రేక్ చేయాలి, సిస్టమ్ ఎలా డిజైన్ చేయాలి అనే పనిలో మనిషే ముందుండాల్సి ఉంటుందంటారు. ఆయన అనుభవంతో ఒక కోడింగ్ బగ్ GitHub Copilotతో ఎలా క్లియర్ చేశాడో, అది కూడా షేర్ చేశారు.
AI రాస్తుంది కానీ.. దానికి డైరక్షన్ మనిషే ఇవ్వాలి
మైక్రోసాఫ్ట్‌లో ఇప్పటివరకూ కొన్ని ప్రాజెక్టుల్లో 30% వరకూ కోడ్ AI రాస్తోంది అని నాదెళ్ల వెల్లడించారు. కానీ అసలు ప్రాబ్లెమ్‌ను డిజైన్ చేయడం, పరిష్కారం నిర్మించడం మాత్రం ఇంకా మనుషుల శక్తిపైనే ఆధారపడుతోంది. ఇక Agentic AI, సిస్టమ్ లెవల్ డెవలప్‌మెంట్ వంటి పరిణామాల వల్ల టెక్ స్టాక్ మొత్తం మారుతోందని, డెవలపర్లకి కొత్త అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. ఇంకొక విశేషం – మైక్రోసాఫ్ట్ ఇండియాలో 2026 వరకు 5 లక్షల మందికి AI స్కిల్స్ నేర్పించేందుకు ప్రణాళిక వేసింది. ఇందులో విద్యార్థులు, టీచర్లు, గవర్నమెంట్ అధికారులు, మహిళా ఆంత్రప్రెనర్లు ఉంటారు. AI Productivity Labs, AI Centre of Excellence (AI Catalysts) లాంటివి పది రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తారు. మొత్తానికి, “AI పక్కనుంటుంది… కానీ దాన్ని గైడ్ చేయాల్సింది మానవ మేథే” అని నాదెళ్ల తేల్చిచెప్పారు.





