- ‘‘ఇది నా శైలికే భిన్నమైన సినిమా… అంతకన్నా స్పెషల్‌గా ఉందంటున్నారు’’
- ‘‘నాగార్జున, ధనుష్ ఇద్దరూ ఓకే చేస్తారో లేదో అనిపించింది… కానీ నమ్మారు’’
‘కుబేర’ సినిమాపై దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా నమ్మకంగా ఉన్నారు. ‘‘ఈ సినిమా ఇంకా వర్క్‌లోనే ఉంది. అందుకే తెలుగు మీడియాకి ఇంటర్వ్యూలు ఇప్పట్లో ఇవ్వలేకపోతున్నా. పూర్తయ్యాక ప్రమోషన్‌కు వస్తా. నా దృష్టిలో ‘కుబేర’ అంటే తల్లిలాంటి సినిమా. ధనవంతుడైనా, పేదవాడైనా తల్లి ప్రేమలో తేడా ఉండదు కదా? అదేలా ఈ కథ ఉంది. ఇది గర్వంగా చెప్పడం కాదు కానీ… ఈ సినిమా చూసి సరస్వతీ దేవి తల ఎత్తుకుని చూస్తుందని నమ్మకం’’ అని అన్నారు.
‘‘ఇది పక్కా పాన్ ఇండియా సినిమా’’
‘‘ఇది ఎమోషన్, కామెడీ, థ్రిల్ అన్నీ కలబోసిన కథ. ఇప్పటివరకూ మీరు చూడని కోణం ఇది. నా సినిమాలకి అలవాటైన స్టైల్‌కి ఇది కాస్త డిఫరెంట్. కథకు చైతన్య పింగళి మంచి సపోర్ట్ ఇచ్చారు. నాగార్జున గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ డైరెక్టర్‌గా ఆయనను డీల్ చేయాలంటే మొదట టెన్షన్ అనిపించింది. స్క్రిప్ట్ విని వెంటనే ఓకే చెప్పేశారు. ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రైనా లావుగా అయినా, సన్నగా అయినా మారిపోయి చేస్తారు. మొదటి సీన్ నుంచే ఆయన నటన అద్భుతం’’ అని చెప్పారు. ఈ సందర్బంగా వేడుకకు హాజరైన రాజమౌళికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు.





