షారుక్ ఖాన్ దక్షిణాది హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా చేయడం ఆపాలి!?

బాలీవుడ్‌ హీరో షారుక్ ఖాన్, దక్షిణాది కథానాయకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన గ్లోబల్ విలేజ్ కార్యక్రమంలో డ్యాన్స్ చేసి, ప్రేక్షకులను అలరించారు.

బాలీవుడ్‌ హీరో షారుక్ ఖాన్, దుబాయ్‌లో జరిగిన ‘గ్లోబల్ విలేజ్’ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా, ప్రభాస్‌, మహేశ్‌బాబు, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, యశ్‌, రజనీకాంత్‌, విజయ్‌ వంటి దక్షిణాది స్టార్స్ తన స్నేహితులుగా పేర్కొన్నాడు. వేగంగా డ్యాన్స్‌ చేయడం ఆపేయాలని వారికి విజ్ఞప్తి చేస్తూ నవ్వులు పూయించాడు. ఈ వ్యాఖ్యలతో ప్రాంగణంలో అభిమానుల కేరింతలు వినిపించాయి.గతంలో కూడా షారుక్‌ దక్షిణాది చిత్ర పరిశ్రమపై తన అభిమానాన్ని చాటుకున్నారు. కోలీవుడ్‌ డైరెక్టర్ అట్లీ, నటులు నయనతార, విజయ్ సేతుపతితో కలిసి పని చేసిన ‘జవాన్’ చిత్రం రూ.1000 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం, ‘కింగ్’ చిత్రంలో నటిస్తున్న షారుక్‌ తనయ సుహానా ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.