- ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో గిల్ (87) మెరుపులు
- రోహిత్ మద్దతుతో కంఫర్టబుల్‌గా బ్యాటింగ్
భారత వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన శుభ్‌మన్ గిల్ తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో మొదటి వన్డేలోనే 87 పరుగులతో జట్టును ముందుండి నడిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు. తన ఇన్నింగ్స్ అనంతరం మాట్లాడుతూ, “రోహిత్ పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ఏమైనా చెప్పాలనుకుంటే నిర్మొహమాటంగా చెప్పమని సూచించాడు. కెప్టెన్‌గా అతడు ఎలా ఆలోచిస్తాడో అర్థం చేసుకుంటున్నాను” అని పేర్కొన్నాడు. కొత్త బంతితో వేగం ఎక్కువగా ఉంటుందని ముందే అంచనా వేసిన గిల్, 70 పరుగుల మార్క్‌కు చేరుకున్న తర్వాత పుల్‌షాట్లను ఆడేందుకు ప్రయత్నించాడని వివరించాడు.
“నాకు ముందే తెలుసు” – అక్షర్ పటేల్
ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ (52) కూడా అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. గిల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. మ్యాచ్ అనంతరం అక్షర్ మాట్లాడుతూ, “ఎడమ – కుడి బ్యాటింగ్ కాంబినేషన్ వల్ల నేను ముందుగా రావాల్సి వస్తుందని ముందే తెలుసు. బ్యాటింగ్‌తో పాటు, బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు తీయగలిగాం” అని చెప్పాడు.





