- ఎస్కేఎన్ వ్యాఖ్యలు.. నెటిజన్ల రియాక్షన్
- ‘బేబీ’ హిట్ తర్వాత SKN, సాయి రాజేశ్ నిర్ణయం వివాదాస్పదం
‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ కాయల్ లోహిదు గురించి మాట్లాడుతూ, ‘తెలుగురాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తాం’ అని చెప్పడం వివాదాస్పదమైంది. ‘తెలుగు తెలిసిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏం జరుగుతుందో తెలిసింది. అందుకే ఇకపై తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తాం’ అని SKN వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే ఆయన ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారనే చర్చ జోరుగా సాగుతోంది. 2023లో ‘బేబీ’ సినిమా బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్‌గా మారింది. ఈ సినిమాతో హీరోయిన్ వైష్ణవి చైతన్యకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే SKN తాజా వ్యాఖ్యలు ఆమెను ఉద్దేశించివేనా? అనే అనుమానాలు నెటిజన్లలో వ్యక్తమవుతున్నాయి.





