- ఐదు రోజులు గడిచినా 8 మంది జాడ తెలియలేదు
- రెస్క్యూ టీమ్ అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ కొనసాగిస్తోంది
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. పైకప్పు కూలిన ప్రదేశంలో బండరాళ్లు, బురద, నీరు పేరుకుపోవడం సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. రెస్క్యూ బృందాలు టన్నెల్ లోపలకి వెళ్లేందుకు పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి.
ప్రభుత్వంపై విమర్శలు, వివరణలు
ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. ‘సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి, సీఎం స్పందించడం లేదు’ అంటూ విమర్శలు చేశారు. అయితే, ప్రభుత్వ వర్గాలు ‘మంత్రులు నిద్రలేకుండా సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు’ అంటూ వివరణ ఇచ్చాయి. మంత్రులు జూపల్లి, ఉత్తమ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు.





