కావాలనుకుంటే సీఎం అయ్యేవాడిని!! కానీ.. సోనూ సూద్‌ భావోద్వేగ స్పందన

బాలీవుడ్‌ నటుడు, ప్రజల కోసం సేవ చేసే వ్యక్తిగా పేరొందిన సోనూ సూద్‌ కీలక విషయాలు వెల్లడించారు. రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి వరకు అవకాశాలు వచ్చినా, వాటిని తాను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, అధికారం కంటే సేవకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ‘‘ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టమని ప్రముఖులు నాకు సూచించారు. తరువాత డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యత్వ ఆఫర్లను కూడా ముందుంచారు. కానీ, రాజకీయాల్లోకి రావడం అంటే నాకు భయం. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం నాకు అనిపించలేదు. నేను స్వేచ్ఛగా జీవిస్తున్నాను. స్వయంగా సాయం చేస్తూ, ఎవరి వద్దా బాధ్యతలు చెప్పుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఉన్నాను. రాజకీయాల్లోకి వెళితే ఆ స్వేచ్ఛ పోతుందనే భావన నన్ను ఆపింది,’’ అని ఆయన అన్నారు.

“ఎత్తుకు ఎదగడం అంత సులభం కాదు”
సోనూ సూద్‌ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తూ, ‘‘ప్రజాదరణ పొందిన వారంతా జీవితంలో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు. కానీ, ఆ ఎత్తులో ఆక్సిజన్‌ ఉండదు. అందులో ఎంతకాలం ఉండగలిగితే అదే ముఖ్యం,’’ అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. కోవిడ్‌ సమయంలో వలస కార్మికులకు అందించిన అద్భుత సేవల ద్వారా సోనూ సూద్ ప్రజల మన్ననలు పొందారు. ప్రస్తుతం కూడా పలు సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి సహాయం అందిస్తున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.