తమిళ స్టార్ హీరో శిలంబరసన్ TR (శింభూ) పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులకు శుభవార్త! జూన్ 2025 నుంచి వరుసగా నాలుగు భారీ సినిమాలతో శింభూ మళ్లీ తన పాత ఫామ్ కంటిన్యూ చేసేందుకు సిద్ధం అవుతుడున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయా సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ షేర్ చేయడంతో, శింభూ ఫ్యాన్స్‌కు డబుల్ జోష్ ఇచ్చారు. శింభూ నటించే సినిమాలు వరుసగా..
- #Thuglife – జూన్ 2025
- #STR49 – రామ్‌కుమార్ దర్శకత్వంలో 2025
- #STR49 – అశ్వత్ దర్శకత్వంలో 2025
- #STR50 – డెసింగ్ పెరియసామి డైరెక్షన్‌లో గ్రాండ్ ప్రాజెక్ట్!
శింభూ వెర్సటైల్ నటన, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో తిరిగి ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. ఈ సినిమాలు 2025లో ఒకదాని వెంట ఒకటి థియేటర్లలో సందడి చేయనున్నాయి. శిలంబరసన్ TR స్టైల్, ఎనర్జీ, మాస్ అప్పీల్ – అన్నీ ఇక తమిళ ప్రేక్షకులకు పండగే!!





