టెక్ టాక్: సెన్సర్ లైట్స్.. స్మార్ట్ ప్లగ్.. ఫోన్ ని డీఎస్ ఎల్ ఆర్ కెమెరాలా మారిపోతే!!

సెన్సర్ లైట్స్.. కదలితే వెలుగుతాయ్!
ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారంటే సేఫ్టీ చూసుకుంటాం. రాత్రి సమయంలో మెట్లు ఎక్కుతున్నప్పుడో.. లేచి వాష్ రూంలోకి వెళ్తున్నప్పుడో.. చికట్లో సరిగా కనిపించక ఇబ్బంది పడుతుంటారు.  లైట్ ఆన్ చేయాల్సి వస్తే.. బోర్డులో స్వీచ్ కోసం వెతుక్కుంటారు.  వాళ్లు కష్టపడకుండా.. సేఫ్టీ విషయంలో జాగ్రత్త తీసుకుందాం అనుకుంటే.. ఇవిగోండి ‘చిల్లిఫిట్ 2 ప్యాక్’ ఎల్ ఈ డీ ల్యాంప్ లను ప్రయత్నించొచ్చు.  ఇవి సెన్సర్ల తో పని చేస్తాయి. ఇంట్లో మనం వాడుతున్న బోర్డుల్లో సాకెట్ కి పెట్టేస్తే చాలు. అంతే.. ఆటోమాటిక్ గా ఇవి పని చేస్తాయి. రాత్రి సమయంలో మెట్ల దగ్గరకి చేరుకోగానే మోషన్ సెన్సర్ తో ఆలోమాటిక్ ఆన్ అవుతాయి. మెట్లు ఎక్కేసి వెళ్లిపోగానే ఆటోమాటిక్ ఆఫ్ అయిపోతాయ్. ఇదే మాదిరిగా వీటిని బెడ్ లాప్స్ రూపంలోనూ వాడుకోవచ్చు. రాత్రి సమయంలో నిద్ర లేచి కూర్చుంటే చాలు.. పక్కనే ఉన్న బెడ్ ట్యాప్ అన్ అవుతుంది. అంతేకాదు… ఎప్పుడైతే  గది చీకటవుతుందో అప్పుడు మాత్రమే లైట్ ఆన్ అవుతుంది. పగటి పూట ఇవి ‘ఆటోఆఫ్’ లోకి వెళ్లిపోతాయి.  లైట్ కింద అదనంగా మరో సాకెట్ ఉంది. గదిలోని ఉన్న కాంతిని బట్టి లైట్ బ్రైట్ నెస్ కూడా మారుతుంది. 
ధర: 999
దొరుకుచోటు: https://shorturl.at/1KXNg

స్మార్ట్ ప్లగ్ కి తగిలించేయండి.. 
ఇప్పుడంతా డిజిటల్ లైఫ్ స్టైల్. అలా కూర్చుని వాయిస్ కమాండ్స్ తో అన్నీ ఆపరేట్ చేసేస్తున్నారు. ఇక ఫోన్ చేతిలో ఉందంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరైతే, మీరు కూడా స్మార్ట్ లైఫ్ ని అనుకరించాలంటే ఇదిగో ఈ స్మార్ట్ ప్లగ్ ని వాడేయండి. దీని పేరు  Ozone 10A WiFi Smart Plug. దీన్ని ఇంట్లో సాధారణ స్విచ్ బోర్డ్ కి కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఒక్కసారి బోర్డ్ కి కనెక్ట్ చేశాక.. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్ అయినా స్మార్ట్ గా మారిపోతుంది.  ఇంట్లోని నెట్ వర్క్ కి నెక్ట్ అయిపోతుంది. సో.. ఇక మీరు ఎక్కడి నుంచైనా ఫోన్ తోనే ఆపరేట్ చేయొచ్చు. ఎలాగంటే.. ఇంట్లో గీజర్ ని ఈ స్మార్ట్ ప్లగ్ కి కనెక్ట్ చేయండి. అంతే.. మీరు ఆఫీస్ నుంచి స్టార్ట్ అవ్వగానే ఫోన్ తో ఇంట్లోనే గీజర్ ని ఆన్ చేయొచ్చు. సో.. మీరు ఇంటికి వెళ్లేలోపే హాట్ వాటర్ సిద్ధంగా ఉంటాయి. ఇదే మాదిరి గా ఇంట్లో లైట్స్ ని ఆన్/ఆఫ్ చేసుకోవచ్చు.  దీంట్లో వాయిస్ కంట్రోల్ కూడా ఉంది.  అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ తో జట్టు కట్టి పని చేస్తుంది. అంతేకాదు.. పదే పదే రోజూ ఎందుకు ఆపరేట్ చేసుకోవడం అనుకుంటే.. స్మార్ట్ ప్లగ్ కి షెడ్యూల్ చేసేయొచ్చు.  అంటే.. ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఎప్పుడు ఆన్ అవ్వాలి.. ఎప్పుడు ఆఫ్ అవ్వాలో ముందే షెడ్యూల్ చేసి పెట్టేయొచ్చు. 
ధర: రూ. 694
దొరుకుచోటు:  https://shorturl.at/BKd6c

డీఎస్ ఎల్ ఆర్ లా పట్టుకోవచ్చు 
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు. ఏమేమో చేసేస్తున్నాం. డీఎస్ఎల్ ఆర్  కెమెరాలా  ఫొటోలు, వీడియోలు తీస్తున్నాం. చెప్పాలంటే ఫొటోల కోసం డిజిటల్ కెమెరాల్ని వాడడం మర్చిపోయాం.  అందుకే ఫోన్ ని మరింత సౌకర్యంగా డీఎస్ ఎల్ ఆర్ కెమెరాల వాడొచ్చు తెలుసా? అదెలాగంటారా? ఇదిగో ఈ MagSafe Camera Grip చూడండి.  ఇది మాగ్నెటిక్ గ్రిప్ తో ఫోన్ ని అంటిపట్టుకుంటుంది. అప్పుడు గ్రిప్ ని చేత్తో పట్టుకుంటే డిజిటల్ కెమెరా మారిపోతుంది.  డిఎస్ ఎల్ ఆర్ కెమెరాలకు ఉండే ‘ఫొటో షటర్’ బటన్ మాదిరిగానే గ్రిప్ కి ఓ బటన్ ఉంది. అద బ్లూటూత్ కనెక్షన్ తో ఫోన్ కనెక్ట్ అవుతుంది.  ఇంకేముందీ.. బటన్ నొక్కతూ ఫొటోలు క్లిక్ మనిపించొచ్చు. మాన్యువల్ గా కావాలంటే బటన్ ని లాక్ చేసుకునే వీలుంది. ఫోన్ స్టాండ్ మాదిరిగా ఫోన్ ని పెట్టుకోవచ్చు.  మ్యాగ్నిటిక్ గ్రిప్ పైన ఫోన్ ని ఎటైనా తిప్పుకునే వీలుంది.  నిలువు లేదా అడ్డంగా ఫోన్ తిప్పుకోవచ్చు. 
ధర: 1499
దొరుకుచోటు: https://shorturl.at/aIa4o

కప్పే కలిపి ఇచ్చేస్తుంది! 
ఓ కప్పు కాఫీ లేదా జ్యూస్…   ఫ్రెష్ మూడ్లోకి తీసుకెళ్తుంది. కానీ, కప్పులో పోసుకున్న కాఫీని కలుపుకోవడం ఎంత మందికి వచ్చు? అంతేకాదు.. జిమ్ కి వెళ్తూ వెళ్తూ ప్రోటీన్ షేక్ కలుపుకోవడం ఎలా?  ఏముందీ.. కప్పులో పోసుకోవాలా? స్పూన్ తో తిప్పుకోవాలా? అంటే.. మీరు స్మార్ట్ కాదు. ఇదిగో ఈ కప్పుని చూడండి. ఇది మిమ్మల్ని స్మార్ట్ గా మార్చేస్తుంది. దీని పేరు Automatic Self Stirring Mug. దీంట్లో కాఫీ కలుపుకోవడం చాలా సింపుల్. మగ్ హ్యాండిల్ కి ఉన్న బటన్ ని నొక్కితే చాలు. క్షణాల్లో కాఫీ కలిపేస్తుంది. అంతేకాదు.. ప్రొటీన్ మిక్స్, ఐస్ టీ, కోల్డ్ కాఫీలను చక్కగా మిక్స్ చేస్తుంది. ఇలా మిక్స్ చేసిన డ్రింక్ మగ్ లోనే బయటికి లీక్ అవ్వకుండా భద్రంగా ఉంచొచ్చు. 
 ధర: రూ. 999
దొరుకుచోటు: https://shorturl.at/tGX55

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.