టెస్లా తాజాగా ఒక కొత్త మైలురాయిని సాధించింది. ఇప్పుడు, టెస్లా వాహనాలు ఫ్యాక్టరీ నుంచి వాటంతట అవే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ డాకింగ్ లేన్లకు చేరుకుంటున్నాయి. ఈ ప్రక్రియలో మానవ జోక్యం అవసరం లేదు. టెస్లా తన వాహనాలను 1.2 మైళ్ల దూరం కదిలించి. మధ్యలో పలు సిగ్నల్స్, స్పీడ్ బ్రేటర్లు, టర్నింగ్స్.. అన్నింటిని అధిగమిస్తూ.. కార్లు ప్రయాణించాయి. ఇది పెద్ద స్థాయిలో ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ (FSD) టెక్నాలజీకి ఒక కీలక అడుగు అని చెప్పొచ్చు. ఈ ప్రయత్నంతో టెస్లా ఆటోమేషన్‌లో ఉన్న పురోగతిని ప్రపంచానికి చూపించింది. ఇది కంపెనీ ఆపరేషనల్ ఖర్చులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మానవ డ్రైవర్ల అవసరం లేకుండా, టెస్లా తమ వాహనాలను త్వరగా డాకింగ్ లేన్లకు తీసుకువెళ్లగలుగుతోంది. అయితే, ఇంకా పబ్లిక్ రోడ్లపై ప్రయాణించాల్సి ఉంది. టెస్లా ఈ సాంకేతికతను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తోంది. ఈ ప్రదర్శన టెస్లా అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అనునడంతో సందేహం లేదు!!






