‘తండేల్’ మూవీ రివ్యూ: నాగ చైతన్య ఎమోషనల్ యాక్టింగ్.. జోడీ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా!!

  • మత్స్యకారుల కథలో దేశభక్తి, ప్రేమకు అద్భుత మేళవింపు
  • నాగ చైతన్య నటన, విజువల్స్, సంగీతం సినిమాకు బలంగా నిలిచిన అంశాలు

నాగ చైతన్య మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న టైంలో వచ్చిన సినిమా ‘తండేల్’. మత్స్యకారుల జీవితం, ప్రేమ, దేశభక్తిని సమపాళ్లలో మేళవించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

తండ్రి స్ఫూర్తితో తన గ్రామంలోని మత్స్యకారుల నాయకుడిగా ఎదిగిన రాజు (నాగ చైతన్య), చిన్ననాటి స్నేహితురాలు సత్య (సాయి పల్లవి)ను ప్రేమించుకుంటాడు. ఏడాదిలో ఎక్కువ సమయం సముద్రంలోనే గడిపే రాజు, సత్యతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే, ఓ తుపాను వల్ల అతడి పడవ పాకిస్థాన్ జలాల్లోకి వెళ్తుంది. అక్కడి అధికారులు రాజును సహా ఇతర మత్స్యకారులను అరెస్టు చేస్తారు. సత్య తన ప్రియుడిని విడిపించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది? రాజు తిరిగి స్వదేశానికి రాడా? అనేదే మిగతా కథ. సముద్రానికి ఆధారపడి జీవించే మత్స్యకారుల కథను గాఢమైన ప్రేమ, సాంకేతికంగా ఉన్నతమైన విజువల్స్, భావోద్వేగాలు మిళితమై సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. చైతన్య, సాయి పల్లవిల కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ‘బుజ్జితల్లి’ పాట ఎమోషనల్‌గా నిలుస్తుంది. రాజు తండేల్‌గా ఎన్నికయ్యే సన్నివేశం హైలైట్.

ప్లస్ పాయింట్స్:

✔ నాగ చైతన్య నటన, ఎమోషనల్ కంటెంట్
✔ సంగీతం, విజువల్స్
✔ తుపాను, సముద్ర ఘట్టాల చిత్రీకరణ

మైనస్ పాయింట్స్:

✖ కొన్నిసాగదీత సన్నివేశాలు!!
✖ క్లైమాక్స్ కాస్త స్లోగా సాగడం

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *