- నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ టీటీడీ ఉద్యోగుల పేరుతో మోసాలు
- వాట్సాప్ గ్రూపుల్లో టికెట్ల పేరిట డబ్బు వసూలు
శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు దళారుల చేతిలో మోసపోతున్నారు. టీటీడీ ఉద్యోగుల పేరుతో, అనధికార పీఆర్వోగా చెలామణి అవుతూ కొందరు భక్తుల నుంచి డబ్బు దండుకుంటున్నారు. నకిలీ వెబ్‌సైట్ల ద్వారా టికెట్లు బుక్ చేస్తే నగదు పోయినట్టే. అలాగే, వాట్సాప్ గ్రూపుల్లో టీటీడీ ఉద్యోగుల పేరుతో సందేశాలు పంపిస్తూ భక్తులను మోసగిస్తున్నారు.
ధార్మిక సేవల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.inలోనే టికెట్లు బుక్ చేయాలి. ఏ సందేహాలైనా టోల్‌ఫ్రీ నంబర్ 1800-4254141 లేదా 155257కు కాల్ చేయాలి. వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి, ఇతర సౌకర్యాల కోసం నేరుగా అధికారిక వ్యక్తులను మాత్రమే సంప్రదించాలి. నకిలీ వెబ్‌సైట్లు, అనుమానాస్పద వాట్సాప్ మెసేజ్‌లకు స్పందించకూడదు.





