విజయవాడ డివిజన్‌లో కొన్ని రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు!!

విజయవాడ డివిజన్‌లోని నూజివీడు-వట్లూరు-ఏలూరు మధ్య ఆటోమేటిక్‌ సెక్షన్‌ ప్రారంభానికి అవసరమైన నాన్‌-ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా ఫిబ్రవరి 8న ఆరు రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. అలాగే, ఫిబ్రవరి 7, 8 తేదీల్లో 13 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు అనవసరంగా ఇబ్బందులు పడకుండా ముందుగానే ఈ మార్పులను గమనించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ఫిబ్రవరి 8న 67261, 67262, 67202, 67201 నెంబర్లతో నడిచే రాజమహేంద్రవరం-విజయవాడ, విజయవాడ-రాజమహేంద్రవరం మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. అలాగే, 17258 కాకినాడ పోర్టు-విజయవాడ, 17257 విజయవాడ-కాకినాడ పోర్టు రైళ్లను రద్దు చేశారు.

మార్గం మార్చిన రైళ్లు

ఫిబ్రవరి 7న షాలిమార్-చెన్నై సెంట్రల్ (12841), షాలిమార్-హైదరాబాద్ (18045), ధన్‌బాద్-అలప్పుజ (13351), సంత్రాగచి-చెన్నై సెంట్రల్ (22807), టాటా-బెంగళూరు (12889) రైళ్లను నిడదవోలు-గుడివాడ-విజయవాడ మీదుగా దారి మళ్లించారు. అలాగే, సీఎస్‌టీ ముంబయి-భువనేశ్వర్ (11019), బెంగళూరు-గౌహతి (12309) రైళ్లను విజయవాడ-గుడివాడ-నిడదవోలు మీదుగా మళ్లించారు. ఫిబ్రవరి 8న కాకినాడ పోర్టు-ఎల్‌టీటీ ముంబయి (17221), విశాఖపట్నం-గుంటూరు (17240) రైళ్లను నిడదవోలు-గుడివాడ-విజయవాడ మీదుగా మళ్లించారు. అదే విధంగా, గుంటూరు-విశాఖపట్నం (17239), సికింద్రాబాద్-సంత్రాగచి (07221), లింగంపల్లి-విశాఖపట్నం (12806), చెన్నై సెంట్రల్-షాలిమార్ (12842) రైళ్లను విజయవాడ-గుడివాడ-నిడదవోలు మార్గంలో నడిపేందుకు నిర్ణయించారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగా ప్లాన్ చేసుకోవాలని, మరిన్ని వివరాలకు రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.