- లహరి, సూపర్ లగ్జరీ బస్సుల్లో 10% డిస్కౌంట్
- రాజధాని ఏసీ సర్వీసులకు 8% రాయితీ
హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. లహరి నాన్-ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం డిస్కౌంట్ అందించనుంది. అలాగే, రాజధాని ఏసీ సర్వీసుల్లో 8% రాయితీ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ముందస్తు రిజర్వేషన్‌కు సంస్థ వెబ్‌సైట్ www.tgsrtcbus.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించింది.





