- భక్తుల రద్దీ తగ్గించేందుకు డ్రోన్లు, ఏఐ సాంకేతికత వినియోగం
- టికెట్ బుకింగ్, ఆలయ సేవలను మరింత సులభతరం చేయనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తిరుపతిలో జరిగిన ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై నిపుణులతో చర్చించారు. లోకేశ్ మాట్లాడుతూ తిరుమల దర్శనాలను మరింత సులభతరం చేసేందుకు ఆన్‌లైన్ సేవలు విస్తరించనున్నట్టు వెల్లడించారు. భక్తుల రద్దీ నియంత్రణ కోసం డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనున్నట్లు తెలిపారు. తిరుపతిలో ఇటీవల చోటు చేసుకున్న రద్దీ సమస్యల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు.





