🔸 టికెట్ల పేరిట ఎవరైనా డబ్బులు అడిగితే.. అది మోసమే
🔸 ఆన్‌లైన్ లోనే బుక్ చేయండి. టీటీడీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే టికెట్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం
🔸 నకిలీ వెబ్‌సైట్ల నుంచి టికెట్లు తీసుకుంటే.. దర్శనం లేదు, డబ్బులూ పోతాయి
తిరుమల దర్శన టికెట్ల పేరుతో మోసాలు జరుగుతున్నట్టు టీటీడీ గుర్తించింది. ఇటీవల భక్తులు కొన్ని నకిలీ వెబ్‌సైట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకుని తిరుమల రాగానే మోసపోయిన ఉదంతాలు వెలుగుచూశాయి. దీంతో టీటీడీ సీనియర్ అధికారులు స్పందించి – ‘టికెట్ల కోసం ఒక్కటి మాత్రమే – https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ లేదా టీటీడీ మొబైల్ యాప్’ అని స్పష్టం చేశారు. ఏదైనా సందేహాలుంటే కస్టమర్ కేర్ నెంబర్: 0877-2263828ను సంప్రదించాలని సూచించారు. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న అనధికార లింకులు, QR కోడ్‌ల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బుకింగ్ చేయొద్దని హెచ్చరించారు.





