- వంశీ ఇంటికి తీసుకెళ్లడం, విశాఖ తరలింపు.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు
- జైల్లో భద్రత పెంపు.. మంగళవారం వంశీని కలవనున్న జగన్
గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన సత్యవర్ధన్‌పై దాడి, కిడ్నాప్ కేసు లో సీసీటీవీ ఫుటేజీలు కీలక సాక్ష్యాలుగా మారాయి. వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ, అతని అనుచరులు సత్యవర్థన్‌ను హైదరాబాద్‌లోని వంశీ ఇంటికి తీసుకెళ్లడం, తర్వాత విశాఖ తరలించడం వంటి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు, ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశారు. A2 – కొమ్మా కోట్లు, A3 – తేలప్రోలు రాము, A5 – ఓలుపల్లి రంగా, A6 – వజ్రకుమార్, A9 – ఎర్రంశెట్టి రామాంజనేయులు సహా మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సత్యవర్థన్ ఇచ్చిన స్టేట్‌మెంట్, సాంకేతిక ఆధారాలు అనుసంధానించగా వంశీపై ఆరోపణలు ధృవీకరించబడ్డాయి.
జైల్లో భద్రత పెంపు.. వంశీని కలవనున్న జగన్
వల్లభనేని వంశీకి జైల్లో ప్రాణహాని ఉందని ఆయన భార్య పేర్కొనడంతో, విజయవాడ జిల్లా జైలులో భద్రతను పెంచారు. వంశీని ఉంచిన సెల్ వద్ద అదనపు గార్డులు నియమించారు. మరోవైపు, మంగళవారం వైఎస్సార్సీపీ అధినేత జగన్ జైల్లో వంశీని ములాఖత్‌లో కలవనున్నారు.





