- విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు
- కస్టడీలో వెన్నునొప్పి సమస్య, జైలులో బెడ్ సదుపాయం
వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీని కిడ్నాప్ కేసులో మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగించాలని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలో న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును వెనక్కు తీసుకునేలా ఫిర్యాదుదారుడిని బెదిరించేందుకు వంశీ కిడ్నాప్‌కి పాల్పడ్డాడన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. పోలీసులు 10 రోజుల కస్టడీ కోరినప్పటికీ, కోర్టు మూడు రోజుల పాటు మాత్రమే అనుమతించింది. విచారణ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. కస్టడీలోకి తీసుకునే సమయంలో వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నానంటూ వంశీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు, జైలులో బెడ్ సదుపాయం కల్పించేందుకు అనుమతి ఇచ్చింది. ఇక, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో శివకుమార్, ఆదిలక్ష్మి, ప్రవీణ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా, జడ్జి రిమాండ్ విధించారు.





