టాక్సీవాలా తర్వాత 9 ఏళ్లకు విజయ్ – రాహుల్ కాంబో!

Vijay Deverakonda - Rana Bali Movie Poster

రాహుల్ పుట్టినరోజున విజయ్ భావోద్వేగ పోస్ట్… సెప్టెంబర్ 11న ‘రణబాలి’ రిలీజ్!

మనం టాక్సీవాలా చూసి 9 ఏళ్లు అయింది కదా. ఆ కాంబినేషన్ మళ్లీ రాబోతోంది. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ‘రణబాలి’ సినిమా రూపొందుతోంది. నేడు రాహుల్ పుట్టినరోజు సందర్భంగా విజయ్ ఆయనకు విషెస్ చెబుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. (Rana Bali movie release date) ‘టాక్సీవాలా వచ్చి తొమ్మిదేళ్లు దాటింది. ఈ తొమ్మిదేళ్లలో మనమిద్దరం ఎన్నో విషయాల్లో ఎదిగాం. అర్థవంతమైన కథలు రాయాలి.. ప్రేక్షకులను అలరించాలనే నీ పట్టుదలలో.. నీ పాత్రకు ప్రాణం పోయాలనే నా తపనలో ఎలాంటి మార్పూ రాలేదు. మనం కలిసి చేసింది కేవలం రెండు సినిమాలే.. అయినా వాటి కోసం ఎన్నో యుద్ధాలు చేశాం. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం. అన్ని అడ్డంకుల మధ్య విడుదలైన మన మొదటి సినిమా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇప్పుడు రెండో చిత్రానికి కూడా నేను నీకు తోడుగా ఉన్నాను. మనం మళ్లీ ఆ ప్రేక్షకాదరణను పునరావృతం చేద్దాం. విజయాన్ని అందుకుందాం’ అని విజయ్ రాసుకొచ్చారు. రాహుల్ పనితనాన్ని ప్రపంచం చూడబోతున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉందని పేర్కొన్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ రూపొందుతోంది. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు విడుదల కానుంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.