విశాల్‌ ఆరోగ్యంపై ఆందోళన: వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నట్టు తెలియజేసిన టీమ్!

హీరో విశాల్‌ ఆరోగ్యంపై ఆదివారం సాయంత్రం నుంచి పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ‘మదగజరాజ’ ప్రెస్‌మీట్‌లో ఆయన చేతులు వణుకుతూ, నీరసంగా కనిపించడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో విశాల్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆయన టీమ్‌ హెల్త్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది. అందులో, ఆయన వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారని, వైద్యులు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. ‘మదగజరాజ’ సినిమా 12 సంవత్సరాల తరువాత విడుదల కానుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం ఈ సినిమా ప్రమోషన్లో విశాల్‌, ఖుష్బూ, సుందర్‌.సి, విజయ్‌ ఆంటోనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాల్‌ అనారోగ్యంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘గెట్‌ వెల్‌ సూన్‌’ అంటూ వారు పోస్ట్‌లు పెట్టారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *