హాట్ అప్ డేట్:  ఇక కాంటాక్ట్స్ ని వాట్సాప్ లోనే సేవ్ చేయొచ్చు!!

టెక్స్ట్ ఛాటింగ్ లు.. వీడియో కాల్స్ మాత్రమే కాదు. ఫోన్ కాల్స్ కూడా వాట్సాప్ నుంచే చేసేస్తున్నాం. ఈ క్రమంలో ఇప్పటి కీ ఓ సమస్య యూజర్లకు ఎదురయ్యేది. అదేంటంటే.. ఏదైనా ఫోన్ నెంబర్ ని సరాసరి వాట్సాప్ నుంచే సేవ్ చేయలేకపోవడం. ముందు ఫోన్ కాంటాక్ట్స్ లోకి వెళ్లి సేవ్ చేయాలి. అప్పుడే ఆ కాంటాక్ట్ వాట్సాప్ లోకి సింక్ అయ్యేది. ఇకపై అలాంటి సమస్య లేదు. వాట్సాప్ కొత్త అప్ డేట్ తో కాంటాక్ట్ లను సులభంగా మేనేజ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.  సో.. ఇకపై మీరు ఫోన్ నెంబర్ సేవ్ చేయాలంటే వాట్సాప్ ‘కాల్స్’ని ట్యాప్ చేయండి. దాంట్లో ప్లస్ గుర్తుతో ఓ ఫోన్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే కాంటాక్ట్ లిస్ట్ తో పాటు ‘న్యూ కాంటాక్ట్’ పేరుతో ఆఫ్షన్ కనిపిస్తుంది.  సెలెక్ట్ చేసి కొత్త కాంటాక్ట్ లను సేవ్ చేయొచ్చు.  ఇలాా సేవ్ చేసిన కాంటాక్ట్ లు ఫోన్ బుక్ లోనూ, వాడే క్లౌడ్ స్టోరేజ్ లనూ సేవ్ అవుతాయి. ఒక వేళ కాంటాక్ట్ లకు సంబంధించి ఏదైనా అదనపు సమాచారం జోడించాలంటే ‘యాడ్ ఇన్ఫర్మేషన్’ ఆప్షన్ తో చేయొచ్చు. 

పీసీలను నుంచీ కూడా.. 
మరో కొత్త అప్ డేట్ తో త్వరలోనే ‘వాట్సాప్ వెబ్’ నుంచి కూడా కాంటాక్ట్ లను సేవ్ చేసుకునే వీలు కల్పించనుంది. అంటే.. డెస్క్ టాప్, ల్యాపీల నుంచి కూడా కాంటాక్ట్ లను సేవ్ చేసుకునేందుకు వీలుంటుంది. ఇలా సేవ్ చేసినవి ఆటోమాటిక్ గా అన్ని డివైజ్ లలో సింక్ అవుతాయి. కావాలంటే  వాట్సాప్ లో సేవ్ చేసిన కాంటాక్ట్ లను యాప్ వరకే పరిమితం చేయొచ్చు.  ఇక్కడ వాట్సాప్ అందిస్తున్న మరో సౌలభ్యం ఏంటంటే.. వాట్సాప్ లో సేవ్ చేసిన కాంటాక్ట్ లను ఆటోమాటిక్ గా రీస్టోర్ చేయొచ్చు. అంటే.. ఎప్పుడైనా ఫోన్ పోగొట్టుకున్నప్పుడు మరో ఫోన్ లో వాట్సాప్ వాడే క్రమంలో కాంటాక్ట్ లు ఆటోమాటిక్ గా  రీస్టోర్ అవుతాయన్నమాట.  అంతేకాదు.. భవిష్యత్తులో వాట్సాప్ లోని కాంటాక్ట్ లు కేవలం యూజర్ నేమ్ మాదిరిగానే కనిపిస్తాయ్. అంటే.. ఇప్పటి వరకూ వాట్సాప్ లో కాంటాక్ట్ ఉందంటే కచ్చితంగా నెంబర్  కనిపిస్తుంది.  ఎవరైనా కొత్త వ్యక్తి మీకు వాట్సాప్ లో ఏదైనా పంపాలంటే.. మీ నెంబర్ వారికి తెలియాల్సిన అవసరం లేదు.  మీ కాంటాక్ట్ క్యూఆర్ కోడ్ ని చూపిస్తే చాలు. దాన్ని స్కాన్ చేయగానే మీ వాట్సాప్ అకౌంట్ యూజర్ నేమ్ లా ఇతరుల ఫోన్ లో సేవ్ అవుతుంది.  నెంబర్ మాత్రం కనిపించదు.  దీంతో మీ ప్రమేయం లేకుండా మీ నెంబర్ ఇతరులకు చిక్కే ఛాన్స్ ఉండదు.  అంటే.. గ్రూపుల్లో ఎవరైనా మిమ్మల్ని యాడ్ చేస్తే.. ఇకపై మీ యూజర్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. సో.. ఇదో ఎక్స్ ట్రా డిగ్రీ ఆఫ్ ప్రైవసీ’ అన్నమాట. కొత్త కాంటాక్ట్ ని సేవ్ చేసేందుకు కాల్స్ లోకే వెళ్లక్కర్లేదు. ‘న్యూ మెసేజ్’  ఐకాన్ పై ట్యాప్ చేసి కూడా చేయొచ్చు. ‘న్యూ గ్రూప్’, ‘న్యూ నమ్యూనిటీ’తో  పాటు ‘న్యూ కాంటాక్ట్’ కూడా కనిపిస్తుంది. 

స్టేటస్ మారుతోంది.. 
వాట్సాప్ లో స్టేటస్ లకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  అలాంటి స్టేటస్ ని మరింత వినూత్నంగా మర్చేందుకు వాట్సాప్ సిద్దం అవుతోంది. అదేంటంటే.. స్టేటస్ కి చక్కని బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్ పెట్టుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ మాదిరిగా అన్నమాట. నచ్చిన మ్యూజిక్ ట్రాక్స్, పాటల్ని ని వెతుక్కుని స్టేటస్ కి యాడ్ చేయొచ్చు. అందుకు తగినట్టుగా స్టేటస్ అప్ డేట్ స్క్రీన్ లో Music button కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి search songs or artists నుంచి కావాల్సిన వాటిని వెతకొచ్చు. ప్రస్తుతం డెవలపింగ్ మోడ్ లో ఉన్న ఈ ఫీచర్ ని త్వరలోనే బీటా వెర్షన్ లా వాట్సాప్ లాంచ్ చేయనుంది. 

‘లింక్’ని వాడుతున్నారా? 
ఆఫీస్ పని నిమిత్తం జూమ్ లో వర్చువల్ మీటింగ్ లింక్ ని క్రియేట్ చేస్తుంటాం. ఆ లింక్ ని కలిగ్స్ కి షేర్ చేస్తుంటాం. వాళ్లందరూ లింక్ పై క్లిక్ చేసి మీటింగ్ లో జాయిన్ అవుతారు. ఇదే మాదిరిగా వాట్సాప్ లోనూ వీడియో మీటింగ్ లింక్ ని క్రియేట్ చేయొచ్చు తెలుసా? అదెలాగంటే… వాట్సాప్ లోని ‘కాల్స్’ లోకి వెళ్లి అక్కడ కనిపించే ఫోన్ సింబల్ తో కూడిన ఐకాన్ ని సెలెక్ట్ చేయాలి.  వచ్చిన ఆప్షన్స్ లోని ‘న్యూ కాల్ లింక్’ ని ట్యాప్ చేయండి.  దీంతో వీడియో మీటింగ్ కి సంబంధించిన యూఆర్ ఎల్ క్రియేట్ అవుతుంది. తర్వాత  ‘కాల్ టైప్’ ని (వీడియో, వాయస్) ఎంచుకోవాలి.  తర్వాత ఆ లింక్ ని వాట్సాప్ నుంచే షేర్ చేయొచ్చు. లేదంటే.. ‘కాపీ లింక్’ ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ మెసేజ్ రూపంలో పంపొచ్చు.  మెయిల్ లేదా మరేదైనా ఇతర సర్వీసుల నుంచి షేర్ చేయాలనుకుంటే ‘షేర్ లింక్’ ఆప్షన్ ని సెలెక్ట్ చేయొచ్చు. ఇతరులు ఎవరైనా ఆ లింక్ పై క్లిక్ చేసి మీటింగ్ లో జాయిన్ అవ్వొచ్చు. 

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.