బిగ్‌బాస్‌కి 800 చీరలు, 50 కిలోల నగలు.. ఎవరు ఈ తాన్య మిట్టల్?

సాధారణంగా బిగ్‌బాస్‌కు వెళ్లే కంటెస్టెంట్‌లు గెలవడానికి రకరకాల వ్యూహాలు వేసుకుంటారు. కానీ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రం వాటన్నిటినీ పక్కనపెట్టి, తన రాయల్ లైఫ్‌ని హౌస్‌లో చూపించాలని నిర్ణయించుకున్నారు. ఆమె హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్ కంటెస్టెంట్ తాన్య మిట్టల్.

తాన్య మిట్టల్ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లే ముందు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏకంగా 800 చీరలు, 50 కిలోల నగలతో హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఇంత ఆర్భాటం ఎందుకని అడిగితే, తన లగ్జరీలను ఎందుకు వదులుకోవాలని ఎదురు ప్రశ్నించారు. హౌస్‌లో రోజుకు కనీసం మూడు చీరలైనా కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. వెండి వస్తువులను కూడా ఆమె తనతో తీసుకెళ్లారు. బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి వీఐపీ ట్రీట్‌మెంట్ ఒక కంటెస్టెంట్‌కు దక్కడం ఇదే మొదటిసారి.

ఎవరీ తాన్య మిట్టల్?

తాన్య మిట్టల్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 2000వ సంవత్సరంలో జన్మించారు. తన 19 ఏళ్ల వయసులోనే కేవలం ₹500 తో ‘హ్యాండ్‌మెడ్ లవ్ బై తాన్య’ అనే పేరుతో హ్యాండ్‌బ్యాగ్‌లు, నగలు అమ్మే వ్యాపారాన్ని మొదలు పెట్టారు. తరువాత దీనికి చీరలను కూడా జోడించారు. 2018లో మిస్ ఆసియా టూరిజం యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. వ్యాపారం, యాడ్స్ ద్వారా నెలకు ₹6 లక్షలు సంపాదిస్తున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *