
ఏంటో లైఫ్ చాలా సాదా సీదాగా గడిచిపోతోంది.. స్కార్ఫ్ ముఖానికి కట్టుకోవడడం.. ట్రాఫిక్ హారన్లు.. 10 టూ 5 జాబులు.. ఈఏఐలు.. నెలవారీ సరుకులు!!! ఇల్లు.. పిల్లలు… టైమ్ కి తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా? ఏదో మిస్ అవుతున్నాం కదా.. అని మీకు అనిపిస్తోందా? అయితే, జీవించడానికి బతకడానికి మధ్య ఎంతో తేడా ఉంటుందని తెలుసుకునే టైమ్ వచ్చినట్టే. జీవితంలోని ప్రతి నిమిషాన్నీ ఆస్వాదిస్తూ ఆనందంగా జీవించడం వేరు. ఉద్యోగం చేసుకుంటూ జీతం కోసం ఏదో అలా బతికేయడం వేరు. బతుకును నిస్సారంగా గడపేయకుండా ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాలి. అప్పుడే జీవితాన్ని ప్రేమిస్తూ ఎంతో ఆనందంగా జీవించవచ్చు. “Why should boys have all the fun?” మనకి ఉండొద్దా? రండి.. గుర్తుంతా శీతాకాలం అంటూ… లైఫ్ కి కిక్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం..!!! గిరి గీసుకుంటే.. చెరిపేసి.. పెద్ద బౌండరీ లైన్ గీయండి. కొత్తగా మస్తీ రూల్స్ మీరే రాసుకోండి.
Rule No.1
లైన్ మీదే నడవాలా?
చదువో.. ఉద్యోగమో.. ఏం చేసినా.. మీ ఇష్టాలను, అభిరుచులను వదిలిపెట్టాలని లేదు. చాలామంది ఆఫీసు, ఇల్లు ఈ రెండింటి గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. ఓ లైన్ గీసుకుంటారు. ఇతర ఆలోచనలేవీ చేయకుండా యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోతారు. ఇది ఏమాత్రం సరికాదు. ఏ కాస్త సమయం చిక్కినా మీకిష్టమైన పుస్తకాలను చదవండి. వాటిలోని స్ఫూర్తిదాయక వాక్యాలను ఒకచోట రాసుకోండి. సమయం దొరికినప్పుడు వాటిని మళ్లీ మళ్లీ చదువుకోవచ్చు. ఇష్టమైన పాటలను వినండి. ఓ మంచి రీల్ చేయండి.. ఎప్పుడైనా మనసు బాగోనప్పుడు…ఇష్టమైన పాటలు వింటే నీరసమంతా మాయమై మనసు ఆనందంతో ఉరకలు వేస్తుంది. మీకు కవితలు, కథలు రాయాలనే కోరిక ఉంటే వాటినీ ప్రయత్నించండి. వాటిని మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు చూపించండి. చదివినవాళ్లు బాగాలేదు అంటే మాత్రం నిరుత్సాహపడకుండా ప్రయత్నాలను కొనసాగించండి. సినిమాలు చూడ్డం మీకిష్టమైతే వాటిని చూసి ఆనందించండి. వాటిలో మీకు నచ్చిన విషయాల గురించి స్నేహితులతో చర్చించండి. స్నేహితులే మీ బలం అయితే చిన్ననాటి నేస్తాలతో మనసు విప్పి మాట్లాడండి. అప్పుడప్పుడు వాళ్లతో కలసి విహార యాత్రలకు వెళ్లండి. ఇలా మీ సంతోషాన్ని రెట్టింపు చేసే ఏ ప్రయత్నాన్నీ వదిలిపెట్టకండి.
Break the Rule!!: మన చుట్టూ గీత గీసుకుంటే ముందు కంఫర్ట్ గానే ఉంటుంది. కానీ, కొంత కాలానికి అదో కంఫర్ట్ జోన్ అలా మారిపోతుంది. కిక్ ఉండదు. అంతా కామన్ గా అనిపిస్తుంది. గీతను చెరిపేస్తే చాలు.. ఫ్రెష్ లైఫ్ లోపలికి వస్తుంది.
Rule No.3
మీకు మీరే.. మాకు మేమే!!!
ఏకాంతంగా మీతో మీరు కాసేపు గడపండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి. ఇతరులను ప్రేమించడం వాళ్లు కాదంటే విచారంలో మునిగిపోవడం ఎంతమాత్రం సరికాదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేరమో, ఘోరమో కాదు. ముందుగా మిమ్మల్ని మీరు ఇష్టపడటం నేర్చుకోండి. మీతో మీరు ఎంత సంతోషంగా ఉండగలరో చూడండి. మీకంటూ కొంత సమయాన్ని వెచ్చించండి. ఆ సమయంలో మీ మనసు, ఆలోచనల నిండా మీరు మాత్రమే ఉండాలి. కుటుంబం, ఆఫీసు, స్నేహితులు, బంధువులు… వీరిలో ఎవరినీ ఆ ఆలోచనల్లోకి రానీయకండి. మీ ఆరోగ్యం, అభిరుచులు, ఆనందం కోసం ఇంకా ఏమేం చేయవచ్చో చూడండి. ఏకాంతంగా కాసేపు గడిపితే మీ గురించి మీరు మరింత శ్రద్ధ తీసుకోగలుగుతారు. మీరు అందరితోనూ కలసిపోయి సంతోషంగానే ఉండవచ్చు. అలాగే మీతో మీరు కూడా ఆనందంగా ఉండేలా చూసుకోవాలి.
Break the Rule!!: ఎవరో మిమ్మల్ని ఇష్టపడడం ఏంటి? మిమ్మల్ని మీరే ప్రేమించండి. ఒక్కరే ఓ రైడ్ కి వెళ్లండి. ఏ నది ఒడ్డునో… సెలయేటి వాగులోనో.. చూస్తే..స్వేచ్చ తాలుకూ చిరునవ్వు మీ ముఖంలో కనిపిస్తుంది.

Rule No.2
టైమ్ పాస్ అవ్వాలా?
ఏ కాస్త సమయం దొరికినా దాన్ని వృథా పోనీయకుండా ఒడిసిపట్టండి. మీ ఇంటికి ఆఫీసుకు మధ్య ఎక్కువ దూరం ఉంటే ఆ డ్రైవ్ కి ఓ పాడ్ కాస్ట్ ని పెట్టేయండి. లేదంటే.. మీకిష్టమైన పాటలను వింటూ ఎక్కడికో వెళ్లిపోవచ్చు. కామెడీ సీన్లను చూస్తూ ఒత్తిడిని మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు. మీకిష్టమైన పాత సినిమాలను యూట్యూబ్‌లో చూసుకుని సంతోషించవచ్చు. ఆనందాన్ని వెతుక్కునే ఓపిక ఉండాలికానీ దానికి ఎన్నెన్నో మార్గాలూ ఉన్నాయి. అలాగే మీరు చేయాల్సిన ప్రాజెక్ట్ వర్క్ గురించో నెట్లో బ్రౌజ్ చేయొచ్చు. సో.. ప్రయాణ సమయాన్ని వినోదాత్మకంగా, విజ్ఞానాత్మకంగా మలచుకునే అవకాశం మీకెప్పడూ ఉంటుంది.
Break the Rule!!: కాలం చాలా విలువైందని పొదువు చేయొచ్చు. ఫుల్ గా వాడేయాలి. ప్రతి నిమిషాల్ని ఆస్వాదించాలి. డబ్బుని పొదుపు చేసినా పర్వాలేదు.. కాలాన్ని మాత్రం తనివి తీరా వాడేయండి.
Rule No.4
వృత్తే ప్రవృత్త అయితే!!
క్రికెట్‌ను విరాట్ ని, సినిమాను సావిత్రిని, సంగీతాన్ని ఇళయరాజాను వేర్వేరుగా చూడలేం. ఫ్రొఫెషనల్ ఎదగాలని ఒక రంగాన్ని ఎంచుకుంటే అందులో ఎవరూ ఇంతగా రాణించలేరు. వృత్తి ప్రవృత్తి ఒకటే అయితే చేసే పని ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. విసుగుకు అవకాశమే ఉండదు. వృత్తే ప్రవృత్తి అయినప్పుడు విమర్శలు, ప్రశంసలను ఏ మాత్రం పట్టించుకోరు. బహుమానాలు, బిరుదులు వరించినా వాటిని తలకు ఎక్కించుకోరు. పనిలోనే ఆనందాన్ని, ఆత్మానందాన్ని వెతుక్కుంటారు. ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. వృత్తీప్రవృత్తీ ఒకటే అయినప్పుడు ఆ ప్రయాణం ఆనందంతో నిండిపోతుంది. అలసిపోతున్నామన్న ఆలోచనే రాదు.
Break the Rule!!: లింగ వివక్షని అధిగమించేలా పోటీ ఇవ్వాలంటే.. మహాశక్తిగా ఎదగాలి. ఈ క్రమంలో సంప్రదాయ ఉద్యోగాలకు చెక్ పెట్టాలి. చుట్టూ చూడాలి.. మగువ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేలా.. థింక్ ఢిఫరెంట్.
Rule No.4
అభిరుచులు ఏమున్నాయ్?
స్ట్రెస్ అనిపిస్తే.. వీకెండ్ మస్తీ కోసం వెయిట్ చేయడం.. వ్యవసనాలకు దగ్గరవడం.. దీంతో థైరాయిడ్, మధుమేహం, గుండెపోటు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చర్మ సంబంధ సమస్యలెన్నో ఎదురవుతాయి. అయితే అభిరుచులు మిమ్మల్ని వ్యసనాలకు దూరం చేస్తాయి. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజం. ఒత్తిడిగా అనిపించినప్పుడు మీ అభిరుచులకు మెరుగుపెడితే వ్యసనాలకూ దూరంగా ఉండవచ్చు. క్షణం తీరికలేని ప్రముఖులు కూడా ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి అభిరుచులను ఆశ్రయిస్తున్నారు. అలాగే ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి వంటింట్లో ప్రయోగాలు చేసే ప్రముఖులూ ఎంతోమంది ఉన్నారు.
Break the Rule!!: స్ట్రెస్ అనిపిస్తే జుట్టు ముడేసి.. ఓ క్రికెట్ బ్యాటో అందుకోండి. చుట్టూ ఉన్న పిల్లలతో కాసేపు గల్లి క్రెకెట్ ఆడేయండి. లేదంటే.. నాన్నని వెనక కూర్చోబట్టుకుని బుల్లెట్ పై మీ కాలనీ వీధుల్లో చక్కర్లు కొట్టండి.

Rule No.4
ప్రకృతి కి ప్రేమతో.. !!!
ఒటీటీలు.. వెబ్ సిరీస్ లు ఒకే… అప్పుడప్పుడు విండోలో నుంచి బయటికి చూడండి. ఓ యూనివర్స్ ఉంది. వస్తువులు, మనుషులనే కాదు శాశ్వతమైన ప్రకృతినీ ప్రేమించే మనసు మనకు ఉండాలి. ఉదయించే సూర్యుడిని చూసి మైమరిచిపోవాలి. కురిసే వానలో మనసునూ తడవనివ్వాలి. మొలకెత్తే మొక్కను, విచ్చుకునే మొగ్గను అపురూపంగా చూడాలి. జంతువులు, పక్షులను నిశితంగా పరిశీలించండి. మాటలకందని వాటి ప్రేమతో మీ మనసు ఆనందంతో పులకిస్తుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకునే వాళ్లకు ప్రకృతిని మించిన ఖజానా ఎక్కడా ఉండదు. అది మీకు అంతులేని ఆనందాన్ని పంచుతుంది, పెంచుతుంది కూడా.
Break the Rule!!: ఎప్పుడు లేస్తే అప్పుడు జిమ్ కి వెళ్లడమో.. ఇంట్లో త్రెడ్మిల్ పై వాకింగ్ చేయడం కాదు. స్టెప్ అవుట్.. స్టే కనెక్ట్ విత్ నేచర్.!! లేదంటే.. ఇంట్లో కుక్కో.. కుందేలో ఉంటే.. ఓ గంట వాటితో ఆడుకోండి. రిలాక్స్ అయిపోతారు.





