పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు పాల్పడితే.. ‘షీ బాక్స్’లో ఫిర్యాదు!!

  • మహిళలకు రక్షణగా జిల్లా స్థాయిలో ఫిర్యాదుల కమిటీ
  • ‘షీ బాక్స్‌’ ద్వారా గోప్యంగా ఫిర్యాదు చేసే అవకాశం

పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా ‘మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం – 2013’ కఠినంగా అమలు అవుతోంది. ఈ నిబంధనల ప్రకారం, జిల్లా స్థాయిలో ఐసీడీఎస్ పర్యవేక్షణలో ‘స్థానిక ఫిర్యాదుల కమిటీ’ (LCC) పని చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళలు వేధింపులకు గురైతే ఎల్‌సీసీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అయితే, చాలామంది భయంతో ముందుకు రావడం కష్టంగా భావిస్తారు. అందుకే, ఆన్‌లైన్‌లో ‘She Box’ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అందుకు https://shebox.wcd.gov.in సైట్ లోకి వెళ్తే చాలు. అక్కడ కనిపించే ‘రిజిస్టర్ యువర్ కంప్లైయింట్’ నొక్కి ఫిర్యాదు చేయొచ్చు. వివరాలు గోప్యంగా ఉంటాయి. ఎవరికీ భయపడక్కర్లేదు.

https://youtu.be/bFi7IUbbPNI?si=fUzSdiAhio99Fc4I

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *