ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సరం 2025 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా జనాభా బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2025 నూతన సంవత్సరం తొలిరోజునాటికి ప్రపంచ జనాభా 809 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. 2024 చివరి నాటికి ప్రపంచ జనాభా 7.1 కోట్లు పెరిగిందని, ఈ ఏడాది జనాభా పెరుగుదల రేటు 0.9 శాతంగా నమోదవుతోందని తెలిపింది.
2025లో, ప్రతి సెకనుకు 4.2 జననాలు మరియు 2.0 మరణాలు నమోదవుతాయని ఈ నివేదిక పేర్కొంది. అమెరికాలో జనాభా కూడా పెరుగుతోంది, 2025 నాటికి అమెరికా జనాభా 34.1 కోట్లకు చేరుకుంటుందని అంచనా ఉంది. జనవరి నెలలో అమెరికాలో ప్రతి తొమ్మిది సెకండ్లకు ఒక జననం, ప్రతి 9.4 సెకండ్లకు ఒక మరణం జరుగుతుందని నివేదిక పేర్కొంది. 2020 దశకంలో అమెరికా జనాభా దాదాపు 97 లక్షల మేరకు పెరిగింది, ఇది 2.9 శాతం రేటుతో ఉంది.





