పశ్చిమ గోదావరి జిల్లా ఉంది మండలం యండగండిలో విస్తుగొలిపే ఘటన చోటుచేసుకుంది. పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
అశ్విన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు
సాగి తులసి అనే మహిళకు యండగండి గ్రామంలో ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు కాగా, ఆమె ఇల్లు నిర్మిస్తోంది. ప్రస్తుతం ఆ ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి ఆమె దరఖాస్తు చేసుకుంది. మొదటి విడతలో సేవా సమితి టైల్స్ అందజేసింది.మరోసారి ఆర్థిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకోగా, పార్శిల్‌లో విద్యుత్ సామగ్రికి బదులు మృతదేహం వచ్చింది. పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా ఉన్నట్లు గుర్తించారు, అందులో రూ.1.30 కోట్లు చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల చర్యలు
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పార్శిల్ పెట్టెలో సుమారు 45 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం సగ భాగం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన స్థానిక ప్రజలను తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది.






